AP Agriculture Budget:

AP Agriculture Budget: 48 వేల కోట్ల‌తో ఏపీ వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌

AP Agriculture Budget:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రూ.48,340 కోట్ల‌తో వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 28) బ‌డ్జెట్ స‌మావేశాల్లో వ్య‌వ‌సాయ రంగాల్లో వివిధ కేటాయింపుల‌తో కూడిన వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌ను మంత్రి ప్ర‌వేశ‌పెట్టారు. స్వ‌ర్ణాంధ్ర ల‌క్ష్యంగా అడుగులు వేసే దిశ‌గా ఈ బ‌డ్జెట్ కేటాయింపులు చేశామ‌ని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

AP Agriculture Budget:వ‌రిని ప్రోత్స‌హించాల‌ని వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై దృష్టి సారించామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు త‌న ప్ర‌సంగంలో వివ‌రించారు. 11 పంట‌ల‌ను గ్రోత్ ఇంజిన్లుగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని, ఆ పంట‌ల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు.

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.48,340 కోట్లు కేటాయింపు
వ్యవసాయశాఖకు రూ.12,401 కోట్లు
వ్యవసాయ రంగంలో 15శాతం వృద్ధి లక్ష్యం
7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశాం
రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను చెల్లించాం
గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలు: అచ్చెన్నాయుడు
ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు
వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139.65 కోట్లు
ఏలూరు, తూ.గో జిల్లాల్లో పామాయిల్, కోకో క్లస్టర్
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి క్లస్టర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి రూ.500 కోట్లు
ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు
పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.96 కోట్లు
మార్కెటింగ్ శాఖకు రూ.315.32 కోట్లు
డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు
875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు
రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.250 కోట్లు
కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు
అన్నదాత-సుఖీభవ కింద రూ.9,400 కోట్లు
భూమిలేని కౌలు రైతులకు ఏడాదికి రూ.20వేలు
పంటల బీమా పథకానికి రూ.1,028 కోట్లు
చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్
శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో జీడీ మామిడి క్లస్టర్
శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కొబ్బరి క్లస్టర్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *