Hyderabad: హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. శ్రీ చైతన్య కళాశాలల్లో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫీజులు ఇబ్బందులు ఒకవైపు, కార్పొరేట్ విద్యలో ఒత్తిళ్లు, తల్లిదండ్రుల ఆరాటం.. వెరసి ఎందరో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఎన్నో ఆశలతో జూనియర్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు.. మధ్యలోనే తమ భావి జీవితాలను కోల్పోతున్నారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ రాఘవ (17) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి దాటాక తన హాస్టల్ గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ చదువుతున్నాడు. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉన్నది.