Gautam Gambhir:

Gautam Gambhir: గంభీర్ పై మరొకసారి విమర్శలు… కోచ్ కు ఆ మాత్రం తెలియదా…?

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా తన ప్రస్థానం ప్రారంభించిన గౌతమ్ గంభీర్ కు ఇప్పట్లో విమర్శల నుండి ఉపశమనం లభించేలా లేదు. అతను పగ్గాలు చేపట్టినప్పటి నుండి జట్టు ప్రదర్శన అంతమాత్రంగానే ఉంది. పైగా అతని నిర్ణయాల పట్ల కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న గంభీర్.

టీమిండియా చీఫ్ కోచ్ గంభీర్ ప్రస్థానం ఒక ఆటగాడిగా, రాజకీయ నాయకుడిగా, ఐపీఎల్ జట్టు కోచ్ గా ఎంతో గొప్పది. అతను జట్టులో ఉన్న సమయంలో భారత్ గెలిచిన రెండు ప్రపంచ కప్ ఫైనల్స్ లో అతనే టాప్ స్కోరర్. అలాగే అతను కోచింగ్ చేసిన ఐపీఎల్ జట్టు కోల్ కటా నైట్ రైడర్స్ ఈ సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇలా ఎంతో గొప్ప పేరుతో రాహుల్ డ్రావిడ్ తరువాత టీమిండియా పగ్గాలు చేపట్టిన గంభీర్ కు గడ్డుకాలం నడుస్తోంది.

Gautam Gambhir: ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టి20ఐ సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యతతో ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండవ టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే… మొదటి టీ20 మ్యాచ్ లో నితీష్ కు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ అతను రెండవ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం అందరిని నిస్తేజపరిచింది.

దీనిపై విశ్లేషకుడు ఆకాశ చోప్రా మాట్లాడుతూ… అంతర్జాతీయ స్థాయిలో శరీరం పైన ఒత్తిడి అధికంగా ఉంటుందని… ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి వెంటనే టి20 తుదిచెట్టులో చోటు సంపాదించడం… అందుకు సన్నద్ధమయ్యే ప్రక్రియలో గాయం కావడం అనేది పూర్తిగా ఊహించదగినదే అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి, కొన్ని మ్యాచ్లలో బౌలింగ్ కూడా చేశాడు. అలాంటి పెద్ద సిరీస్ లలో ఆడిన తర్వాత వెంటనే మరలా ఇంకొక ఇంటర్నేషనల్ సిరీస్ ఆడితే ఇటువంటి ఫలితాలే పునరావృతం అవుతాయని అతను అభిప్రాయపడ్డాడు.

ఇది కూడా చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ ఆ అవమానం వల్లే రిటైర్మెంట్ ఇచ్చాడా? భారత క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

ALSO READ  Yashasvi Jaiswal: టీమిండియా ప్లేయర్ల టోపీల షాపింగ్.. గ్లాస్ డోర్ లో ఇరుక్కుపోయిన జైస్వాల్

Gautam Gambhir: ఆకాష్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత గౌతమ్ గంభీర్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. కోచ్… ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా వారిపై పడుతున్న పని భారాన్ని కూడా ముందస్తు అంచనా వేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ రెడ్డి… భారత జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. హార్థిక్ పాండ్యా తర్వాత జట్టు ఆధారపడదగ్గ ఏకైక పేస్ ఆల్రౌండర్ అతనే. పైగా కఠినమైన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో పాస్ అయ్యాడు. మరి అతనిపై పని భారం తగ్గించి కీలక మ్యాచ్లకు అతనిని అందుబాటులో ఉంచడం అనేది ఒక కోచ్ గా తన బాధ్యత అని పలువురి అభిప్రాయం. మరి గంభీర్ ఈ వ్యాఖ్యలకు, విమర్శలకు ఎలాంటి సమాధానం ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *