Hyderabad::హైదరాబాద్ నగరంలో మరో విద్యార్థి బెట్టింగ్ మాయకు బలి అయ్యాడు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్టీయూలో ఎమ్‌టెక్ చదువుతున్న పవన్ అనే విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో లక్ష రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన అతను తన ఐఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా అమ్మేసి బెట్టింగ్‌కి పెట్టుబడిగా వాడాడు.
అయితే, ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర నిరాశతో జీవితం ముగించుకోవాలని నిర్ణయించుకున్న పవన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అతని స్నేహితులు, కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది. రోజురోజుకూ యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. దీనిపై అధికారులు గంభీరంగా స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.