America: అమెరికాలో భారతీయులు మరణాల ప్రకంపన కొనసాగుతుంది. నెలకొకరు ప్రాణాలు కోల్పోతూ కన్నవారికి దూరమవుతున్నారు. తాజాగా అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. వివరాలు లోకి వెళ్తే…హైదరాబాద్‌లోని ఉప్పల్ వాసి ఆర్యన్ రెడ్డి (23) అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా నగరంలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 13న ఆర్యన్ బర్త్‌డే. దీంతో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు.
అయితే అదే రోజు బర్త్‌డే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత తన వద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేసే క్రమంలో అది మిస్‌ఫైర్ అయి ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడని యూఎస్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మృతుడి స్వస్థలం కళ్యాణ్ పురిలో విషాదం అలుముకుంది. ఆర్యన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తన పుట్టిన రోజు జరుపుకున్న రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో తోటి స్నేహితులు భయాందోళనకు గురయ్యారు.