Anjankumar Yadav: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి మంత్రి పదవిపై ఆశతో ఉన్న ఆయన కోరిక ఈనాటికీ నెరవేరలేదు. నెరవేరేలా కనిపిస్తలేదు. ఈ దశలో మళ్లీ తన గళాన్ని వినిపించారు. ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద కూడా వెళ్లబోసుకున్నారు.
Anjankumar Yadav: యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చేందుకు సీనియర్ నేత లేని లోటును తనతో భర్తీ చేయాలంటూ అంజన్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే ఆయన తనయుడు అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అందుకే మంత్రి పదవి విషయంలో నాన్చుతున్నారని, ఎంపీ పదవి ఇస్తే తనకు మంత్రి పదవి విషయంలో ఎందుకు అభ్యంతరాలు అంటూ అంజన్‌కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు.
Anjankumar Yadav: తనకు మంత్రి పదవి కావాల్సిందేనని అంజన్‌కుమార్ యాదవ్ పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా? లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇస్తరో మీరే తేల్చుకోండి అని కాంగ్రెస్ పెద్దలకు అంజన్‌కుమార్ యాదవ్ తేల్చి చెప్పేశారు. యాదవుల్లో తనకంటే బాగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారు ఎవరున్నారో చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు. మల్లికార్జున్ ఖర్గేకు కూడా ఇవే విషయాలను చెప్పానని అంజన్‌కుమార్ యాదవ్ స్పష్టంచేశారు.

