AP Inter Results 2025 Today

AP Inter Results 2025 Today: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లోనే ఫలితాలు

AP Inter Results 2025 Today: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు ఇవాళ, ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఆధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేయవచ్చు.

అలాగే, వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు సులభంగా తెలుసుకోవచ్చు. మీ ఫలితాలను తెలుసుకోవాలంటే 9552300009 నంబర్‌కి “hi” అని మెసేజ్ పంపండి.

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 10.58 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 1535 పరీక్ష కేంద్రాల్లో మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా, ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరిగాయి. పరీక్షలు పూర్తైన కేవలం 20 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి, ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.

ఇతర అప్డేట్ లు:

  • ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ క్లాసులు మొదలయ్యాయి.

  • ఏప్రిల్ 23 వరకు బ్రిడ్జ్ కోర్సు కొనసాగుతుంది.

  • ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు.

  • జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ajith Kumar: మళ్ళీ రేసర్ గా అజిత్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *