Andhra Pradesh Teachers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్జీటీ (Secondary Grade Teacher)లకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మాన్యువల్ కౌన్సిలింగ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వివరించారు.
నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత నిర్ణయం
తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన తన పర్యటన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌లతో కలిసి ఎస్జీటీ బదిలీలపై లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తాను స్వయంగా తెలుసుకున్నానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami IPL 2025: ప్రతి వికెట్ కు రూ.1.66 కోట్లు ..ఐపీఎల్ లో షమీ అట్టర్ ప్లాప్
వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఉపాధ్యాయుల ఇబ్బందులు
ఇప్పటివరకు చేపట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానం వల్ల ఎస్జీటీలు అనేక సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తమ అభిరుచులకు అనుగుణంగా స్కూల్ ఎంపికలు జరగలేదని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయులు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేయడం, ఎమ్మెల్సీల ద్వారా మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఎస్జీటీలకు ఊరట – సంతోషం వ్యక్తం
ఈ అభ్యర్థనల నేపథ్యంలో ప్రభుత్వం చివరికి మాన్యువల్ కౌన్సిలింగ్‌కు ఆమోదం తెలిపింది. నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎస్జీటీలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులకు మెరుగైన ఎంపికల అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు.
ఎస్జీటీల కౌన్సిలింగ్‌పై ముఖ్య ప్రకటన
పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం
ప్రజా ప్రతినిధులు, టిడిపి
ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ గార్లతో ఎస్జీటీ కౌన్సిలింగ్‌పై చర్చించాం.…— Lokesh Nara (@naralokesh) June 9, 2025