Ap news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్, ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో పర్యటించి, అక్కడ జిల్లాకేంద్రాలలో ఏర్పాటు చేయబడ్డ సమావేశాల్లో ఉప కులాల వర్గీకరణపై వ్యక్తులు సంస్థల నుండి వినతులు స్వీకరిస్తుంది.
వినతులు నేరుగా సమర్పించలేని వారు, విజయవాడలోని మొగల్రాజపురంలో ఉన్న ఏకసభ్య కమిషన్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా ఈ-మెయిల్ (omcscsubclassification@gmail.com) ద్వారా జనవరి 9వ తేదీ లోగా పంపించవలసి ఉంటుంది.