10th Class Result 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన 6.19 లక్షల మందికి పైగా విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖ బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఉదయం 10 గంటలకు ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. ఇప్పుడు ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఫలితాలు ఎలా చూడాలి?
విద్యార్థులు తమ ఫలితాలను పొందేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి:
🔹 ఆధికారిక వెబ్‌సైట్లు:
👉 bse.ap.gov.in
👉 apopenschool.ap.gov.in
🔹 మన మిత్ర WhatsApp ద్వారా:
-
9552300009 నంబరుకు “Hi” అని పంపించండి.
-
“విద్యా సేవలు”ను సెలెక్ట్ చేయండి.
-
“SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు”ను ఎంచుకోండి.
-
మీ రోల్ నంబరు ఎంటర్ చేయండి – ఫలితాలు PDF రూపంలో వస్తాయి.
🔹 లీప్ మొబైల్ యాప్:
ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేక లాగిన్ విధానం అందుబాటులో ఉంది. స్కూల్ లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు మొత్తం స్కూల్ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సార్వత్రిక విద్యా పీఠం ఫలితాలు కూడా విడుదల
ఈ సందర్భంగా సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.