Anchor Jhansi: బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటిగా మారి పలు నంది అవార్డులను వివిధ కేటగిరిల్లో అందుకుంది ఝాన్సీ. అడపాదడపా నాటకాలూ వేస్తూ రంగస్థలం మీద కూడా తన సత్తాను చాటుకుంది. భర్త జోగినాయుడుకు విడాకులు ఇచ్చే సమయానికి ఝాన్సీకి ధన్య అనే కూతురు ఉంది. తాజాగా వీరిద్దరూ కలిసి ఆహా కోసం తేజస్వి మదివాడ నిర్వహిస్తున్న ‘కాకమ్మ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో ధన్య ముందే… మీ రెండో పెళ్ళి ఎప్పుడు? అని తేజస్వి… ఝాన్సీని అడిగేసింది. ఆ ప్రశ్నకు కాస్తంత తెల్లబోయిన ఝాన్సీ ఏం సమాధానం చెప్పి ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలానే ధన్యకూ సినిమాల్లోకి రావాలనే కోరిక ఉన్నట్టు తెలుస్తోంది. నాని అంటే ఎంతో ఇష్టమని, మణిరత్నం సినిమాలో నటించాలని ఉందని ధన్య తెలిపింది. ఈ ఎపిసోడ్ శనివారం టెలీకాస్ట్ కాబోతోంది.

