Anaswara Rajan: అనశ్వర రాజన్… మలయాళ సినిమా రంగంలో ఈ పేరు మార్మోగుతోంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయల్ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ యువ హీరోయిన్, చిన్న వయసులోనే ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఈ ఏడాది రేఖా చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనశ్వర, ఆరు నెలల్లో ఐదు సినిమాలతో అదరగొట్టింది. ఎన్ స్వాంతమ్ పుణ్యాలం, పైంకిలీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, వ్యాసన సమేతమ్ బంధుమిత్రాదికల్తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న సాహు గార్లపాటి ఈ సినిమాకు సహ నిర్మాత. అనశ్వర చేతిలో సెవెన్ బై జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌తో సహా మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ స్పీడ్‌తో ఆమె టాలీవుడ్‌లోనూ సత్తా చాటే ఛాన్స్ ఉంది.

