Anasuya: బుల్లితెరపై యాంకర్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ, ఇప్పుడు సినిమాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ‘జబర్దస్త్’ ద్వారా ఆమెకు వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాపులారిటీతోనే ఆమెకు సినిమా అవకాశాలు దక్కాయి. ఇప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ, సినిమాలతో పాటు షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూమ్ల ప్రారంభోత్సవాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు అనసూయ.
జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో సందడి
తాజాగా సూర్యాపేటలో కొత్తగా ప్రారంభించిన ‘మణిముఖుర జ్యువెలరీ’ ప్రారంభోత్సవానికి అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సూర్యాపేట ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆడవాళ్ళకు బంగారంపై ఉండే మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెరుగుతున్న ధరల దృష్ట్యా, కస్టమర్లకు నచ్చేలా కొత్త డిజైన్లతో మణిముఖుర జ్యువెలరీ ముందుకు వచ్చిందని అనసూయ తెలిపారు.
అనసూయ సరదా వ్యాఖ్యలు వైరల్
ఈ కార్యక్రమ వేదికపై అనసూయ మాట్లాడిన మాటలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. “రోజురోజుకు నా వయస్సు తగ్గిపోతుంటే, బంగారం ధర మాత్రం పెరుగుతోంది,” అంటూ ఆమె సరదాగా, సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మంచి ఆఫర్లు ఉన్నప్పుడే బంగారం కొనుక్కోవాలని సలహా ఇచ్చారు.
బంగారం అంటే కేవలం ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకు కూడా చాలా ఇష్టమని, చాలామంది మగవారు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టి పొదుపు చేసుకుంటున్నారని అనసూయ అన్నారు. ఈ విధంగా తన వయస్సు గురించి, బంగారం గురించి ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram

