Anand Deverakonda: ‘బేబీ’ మూవీతో గ్రాండ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య. ఇప్పుడు వీరు జంటగా కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే సితార ఎంటర్ టైన్ మెంట్ లోనూ ఈ జోడీ ఓ సినిమా చేస్తోంది. తొలి వెబ్ సీరిస్ ‘నైన్టీస్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’తో అందరి హృదయాలను దోచుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమా చేయబోతున్నాడు. అందులోని పాత్రలనే ప్రధానంగా తీసుకుని… పదేళ్ళ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగిందో ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్నాడు. ఈ మోస్ట్ రిలేటబుల్ అండ్ హార్ట్ వార్మింగ్ మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ’కి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడ సెటిల్ అయ్యే యువత కు సంబంధించిన కథ ఇదని తెలుస్తోందీ. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మిడిల్ క్లాస్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందని ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది.
