Amith Sha:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం (జూన్ 29) తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు ఆయన అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం పసుపు బోర్డు అధికారులతో ఆయన సమావేశం కానున్నారు.
Amith Sha:ఆ తర్వాత నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి అయిన దివంగత నేత డీ శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్‌షా ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
Amith Sha:బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో కేంద్ర మంత్రి అమిత్‌షా సమావేశం కానున్నారు. పార్టీకి సంబంధించి వ్యవహారాలపై ఆరా తీస్తారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జూన్ 1న ఉన్న దృష్ట్యా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది. బీజేపీ అధిష్టానం సూచనలు, ఇతర కీలక అంశాలను వారితో అమిత్ షా పంచుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

