Weekend Releases: చూస్తుండగానే 2024 ఇయర్ ఎండ్ కు చేరుకున్నాం. ఈ యేడాది చివరి వీకెండ్ లోనూ చిన్న సినిమాలు సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇది వారంలో క్రిస్మస్ రావడంతో ఈ నెల 25న ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర పోషించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీ విడుదలైంది. ఇందులో అనన్య నాగళ్ళ సైతం కీరోల్ ప్లే చేయింది. అదే రోజును సీనియర్ మలయాళ కథానాయకుడు మోహన్ లాల్ నటించిన ‘బరోజ్’ జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాను త్రీడీలో మోహన్ లాలే డైరెక్ట్ చేయడం ఓ విశేషం. ఇక శుక్రవారం ఏకంగా ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ చిత్రం రిలీజ్ అవుతోంది. ధృవ హీరోగా నటిస్తున్న ‘డ్రింకర్ సాయి’, ‘బ్లడ్’, ‘కర్ణపిశాచి’, ‘లీగల్లీ వీర్’, ‘వారధి’ చిత్రాలు వస్తున్నాయి. కిచ్చా సుదీప్ నటించిన కన్నడ అనువాద చిత్రం ‘మ్యాక్స్’ కూడా ఈ శుక్రవారమే విడుదల అవుతోంది.
సినిమాకి సంబందించిన ఈ వాత కూడా చదవండి: పుష్ప-2’ ఖాతాలో మరో రేర్ రికార్డ్
Pushpa 2 The Rule: ఓ పక్క ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించిన వివాదం వార్తలలో నానుతుంటే… మరో పక్క ‘పుష్‌ప-2’ చిత్రం వయొలెంట్ గా పాత రికార్డులను క్రాస్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఈ సినిమా ఇంతవరకూ 1705 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని, అతి తక్కువ సమయంలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన సినిమా ఇదేనని మేకర్స్ తెలిపారు. ఈ మూవీ రిలీజ్ రోజునే రూ. 294 కోట్లు సాధించి కొత్త రికార్డ్ ను సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కంటే ఉత్తరాదిన ‘పుష్ప-2’ చిత్రానికి ఆదరణ బాగుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పై కేసుపెట్టి, అతన్ని జైలులో పెట్టడంతో అతనిపై ఆనుభూతి పెరిగిందని, దానివల్ల సినిమా కలెక్షన్స్ ఊపందుకున్నాయని హిందీ పంపిణీదారులు చెబుతున్నారు.