America:ఇటీవల పెంపుడు కుక్కలపై యజమానులు పంచప్రాణాలు పెట్టుకుంటున్నారు. వాటి పెంపకానికి ఇస్తున్న ప్రాధాన్యం తమ సొంత పిల్లలకూ కొందరు ఇవ్వడం లేదంటే నమ్మండి. రోజూ తమతోపాటు వాకింగ్‌కు తీసుకెళ్తూ ఎందరో ఆనందపడిపోతూ ఉంటుంటారు. మరెందరో కార్లలో తమ వెంటే పెంపుడు కుక్కలను తీసుకెళ్తూ తెగ మురిసిపోతూ ఉంటారు. ఇదిగో.. ఇక్కడా విమానాశ్రయానికి వెళ్లిన ఓ మహిళ అదే పనిచేసింది. కానీ, అక్కడ జరిగిన ఘటన తిరకాసు అయింది.. అప్పుడు ఆమె చేసిన పనేమిటో తెలుసా?
America:అమెరికాలోని మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్లోరిడా విమానశ్రయానికి అలిసన్ లారెన్స్ (57) అనే మహిళ చేరుకున్నది. తను ఎంతగానో నిత్యం ప్రేమించే తన పెంపుడు షెనాసర్ కుక్క (9)ను వెంట తీసుకొచ్చింది. ఎక్కడికెళ్లినా తన వెంటే ఆమె తీసుకెళ్లేది. విమానంలో కూడా ఎంచక్కా తీసుకెళ్లవచ్చు అనుకొని వెళ్లింది. తీరా
విమానంలోకి ఎక్కేందుకు తీసుకెళ్తుండగా, అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. కుక్కను తీసుకెళ్లడానికి సరైన జంతు రవాణా పత్రాలు లేవని తిరస్కరించారు. ఎంతగా బతిమిలాడినా ఆమెకు వారి నుంచి నిరాకరణే ఎదురైంది.
America:విమానశ్రయ సిబ్బంది తన పెంపుడు కుక్కను నిరాకరించడంతో అలిసన్ లారెన్స్‌లో కోపం పెరగసాగింది. ఏంచేయాలోనని విపరీత ఆలోచనలు ఆమెలో రగిలాయి. ఆమెలో రాక్షసత్వం జడలు విప్పుకున్నది. వెంటనే టాయ్‌లెట్ గదిలోకి ఆ కుక్కను తీసుకెళ్లిన ఆమె బకెట్ నీళ్లలో దానిని ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అక్కడే చెత్తసంచిలో కుక్కి మరుగుదొడ్డిలో పడేసి వెళ్లిపోయింది.
America:చెత్తను తొలగించే సిబ్బందికి ఆ కుక్కను తొలగిస్తుండగా, దాని మెడకు ఉన్న పట్టీని గుర్తించారు. దానిపై ఆ కుక్క యజమానురాలి పేరు అలిసన్ లారెన్స్, ఫోన్ నంబర్ ఉన్నాయి. దీంతో ఆమెను గుర్తించిన పోలీసులు ఆమెపై జంతుహింస నేరం కింద అరెస్టు చేశారు. చూశారా? అంతగా ప్రేమించే ఆ కుక్కను నిర్దయగా ఎలా చంపేసిందో. అతిగా ప్రేమను చూపితే విపరీతాలకు దారితీసే ప్రమాదం ఉన్నదని మానసిక విశ్లేషకులు చెప్తుంటారు.

