America: అమెరికాలో దారుణ ఘటన వెలుగు చూసింది. విమానాశ్రయంలో నిలిపి ఉంచిన విమానంలో రెండు మృతదేహాలను తనిఖీ అధికారులు గుర్తించారు. అమెరికాలో గడిచిన నెలరోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. గత డిసెంబర్ నెలలో షికాగో నుంచి మౌయూ విమానాశ్రయానికి వెళ్లిన ఓ యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్‌లో కూడా ఓ మృతదేహం వెలుగు చూసింది.
America: అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ విమానాశ్రయానికి జెట్ బ్లూ సంస్థకు చెందిన విమానం వచ్చింది. ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ ప్రాంతలో తనిఖీలు చేస్తుండగా, రెండు మృతదేహాలను గుర్తించారు. ఇదే విషయాన్ని జెట్ బ్లూ సంస్థ ధ్రువీకరించింది.
America: అయితే మృతులు వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ మేరకు అక్కడి పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. మృతులు ఎవరు? ఘటన ఎలా జరిగింది? అనే విషయాలను వారు తేల్చనున్నారు. అమెరికాలో ఇటీవల జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తుండగా, విమానాల్లో ఏకంగా మృతదేహాలు లభ్యంకావడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.