America: అమెరికాలో తరచూ టోర్నడోలు విలయం సృష్టించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లో టర్నడోలు బీభత్సం సృష్టించి, 21 మంది ప్రాణాలను హరించివేసింది. ఈ తుపాన్ ధాటికి ఒక్క రాష్ట్రంలోనే సుమారు 5,000 భవనాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది నివాస ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
America: అమెరికాలోని కెంటరీ, మిస్సోరీ రాష్ట్రాల్లో ఈ టోర్నడోలు తీవ్ర ప్రభావం చూపి 21 మంది మరణించారు. కెంటకీ రాష్ట్రంలో 14 మంది, మిస్సోరీ రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారు. మరెందరో గాయాలపాలయ్యారు. ఆయా రాష్ట్రాల్లో తీవ్ర నష్టం కలిగింది. బాధితులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఆయా రాష్ట్రాల అధికారులు వెల్లడించారు. పలుచోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, ఇతర మౌలిక వసతులకు ఆటంకం ఏర్పడింది.
America: ఇల్లినోయీలో కూడా టోర్నడోలు బీభత్సం సృష్టించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగిపోయింది. ఎందరో ప్రజలు నిరాశ్రయులుగా మిగిలారు.