Maharashtra: మహారాష్ట్రలోని జలగావ్ ప్రాంతంలో నడిరోడ్డుపై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగడంతోపాటు పొగలు వ్యాపించాయి. నిన్న రాత్రి ఓ గర్భిణిని ఎమర్జెన్సీ కావడంతో అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ సమయంలో మార్గమధ్యంలో ఆ అంబులెన్స్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీనిని గమనించిన అంబులెన్స్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనం నుంచి దిగిపోయారు. గర్భిణిని, ఆమె బంధువులను కిందికి దించారు. వారు దిగిన కాసేపటికే నడిరోడ్డుపై నిలిపి ఉంచిన అంబులెన్స్ వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. ఈ సమయంలో భారీగా శబ్ధం వచ్చింది. మంటలు ఎగజిమ్మాయి. అయితే అటుగా వెళ్తున్న వాహనాలకు కూడా ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.