TGPSC: ఇటీవల టీజీపీఎస్సీ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో వేగం పుంజుకున్నది. ఇప్పటికే వివిధ పరీక్షల్లో తుది ఫలితాలను వెంటవెంటనే వెల్లడిస్తూ, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇస్తుండగా, మరోవైపు పరీక్షల నిర్వహణలో, అనంతర ప్రక్రియలో టీజీపీఎస్సీ తలమునకలై ఉన్నది. తాజాగా తుది ఫలితాలు ఇచ్చిన జేఎల్ అభ్యర్థులు పోస్టింగుల కోసం ఎదురు చూస్తుండగా, తుది ఫలితాల వెల్లడి కోసం గ్రూప్ 4, గ్రూప్ 1 అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఇచ్చి, ఈ ఏడాదిలోపే భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ దశలోనే ఈ నెలలో జరిగే మరో పరీక్షకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది.
TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గ్రూప్ 3 పరీక్ష కోసం 5.36 లక్షల మంది అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నిరుద్యోగులు
TGPSC: ఇప్పటికే ఏజ్‌బార్ కావస్తున్న వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎలాగైనా గట్టెక్కాలను పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. హైదరాబాద్‌లోనే వేలాది మంది కోచింగ్‌లు తీసుకుంటూ, లైబ్రరీలు, స్టడీహాళ్లు, పార్కుల్లో చదువుతూ తలమునకలై ఉన్నారు. ఇప్పటికే గ్రూప్ 3 పరీక్షల హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
TGPSC: ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ కోసం కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి ఆదేశాలను జారీ చేశారు. తొలిరోజైన 17న ఉదయం, సాయంత్రం సెషన్‌లో రెండు పరీక్షలు ఉంటాయని, 18న ఉదయం సెషన్‌లోనే పరీక్ష ఉంటుంది. మొత్తంగా మూడు పరీక్షలను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది.
TGPSC: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న 1,380 ఉద్యోగ ఖాళీలను ఈ గ్రూప్ 3 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. 17న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 5:30 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. అదే విధంగా 18న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 3 ఉంటుంది. ఇదే విధంగా వచ్చే నెలలోనే గ్రూప్ 2 పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించనున్నది.