Amazon: ఏఐ స్టార్టప్ పెర్ప్లెక్సిటీకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లీగల్ నోటీసులు పంపింది. పెర్ప్లెక్సిటీ రూపొందించిన కామెట్ బ్రౌజర్ ద్వారా యూజర్లు అమెజాన్‌లో షాపింగ్ చేసుకునే ఫీచర్‌ను నిలిపివేయాలని అమెజాన్ ఆదేశించింది.
ఈ బ్రౌజర్లోని ఏఐ అసిస్టెంట్ యూజర్ తరఫున వెబ్సైట్లలో సెర్చ్ చేసి, వస్తువులను కొనుగోలు చేసే సదుపాయం ఉంది. అమెజాన్ దీనిపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ స్పందన రాకపోవడంతో చివరకు నోటీసులు పంపింది.
దీనిపై పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్పందిస్తూ, అమెజాన్‌తో కలసి పని చేయాలని సంస్థ ఉద్దేశం కామెట్‌ను బ్లాక్ చేయడం వలన యూజర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు.అయితే అమెజాన్ మాత్రం తమ ప్లాట్‌ఫార్మ్‌లో థర్డ్ పార్టీ ఏఐ ఏజెంట్లు యూజర్ల తరఫున కొనుగోళ్లు చేయడాన్ని అనుమతించమని స్పష్టం చేసింది.

