Amaravati: ఏపీ రాజ్యసభ అభ్యర్థి ఇతనే

Amaravati::ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిని ఖరారు చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన రాజ్యసభ ఖాళీ స్థానానికి బీజేపీ నాయకత్వం పాక వెంకట సత్యనారాయణను అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించింది.

ఈ నిర్ణయం బీజేపీ ఏపీ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో తీసుకున్నది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి యూరప్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పాక వెంకట సత్యనారాయణ అభ్యర్థిత్వానికి అధిష్ఠానం మొగ్గుచూపినట్టు సమాచారం.

పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే ధోరణిలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నది. పాక వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం మున్సిపల్ చైర్మన్‌గా సేవలు అందించారు. అంతేకాకుండా పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థిని తుది గా ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *