Raaka

Raaka: గిన్నిస్‌ రికార్డు సాధించిన అల్లు అర్జున్‌ ‘రాకా’చిత్రం

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka) షూటింగ్ దశలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని భారతీయ తెరకు పరిచయం చేస్తూ ఏకంగా ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ (Guinness World Records) సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ఈ స్థాయి గుర్తింపు దక్కించుకోవడంతో భారత సినీ పరిశ్రమ ఒక్కసారిగా విస్మయానికి గురైంది.

ఆ ఘనత ఏంటి? – గిన్నిస్ రికార్డ్ వివరాలు..

టెక్నాలజీ పరంగా సరికొత్త హద్దులను చెరిపేస్తూ ‘రాకా’ సినిమా “రియల్ టైమ్‌లో ఏకకాలంలో అత్యధిక మంది పెర్ఫార్మర్లను మోషన్ క్యాప్చర్ చేసిన” (Most People Motion-Captured in Real-Time) సినిమా గా ఈ అరుదైన గిన్నిస్ రికార్డును నెలకొల్పింది.
సాధారణంగా మోషన్ క్యాప్చర్‌ను కొద్దిమంది నటీనటులపై మాత్రమే ప్రయోగిస్తారు. అయితే ఈ సినిమా కోసం ఏకకాలంలో ఏకంగా 37 మంది నటీనటుల కదలికలు, హావభావాలను అధునాతన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో రికార్డు చేసి ఈ మైలురాయిని అధిగమించారు.
ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ స్వయంగా అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. సర్టిఫికెట్ అందుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మూడు కాలాల నేపథ్యంలో భారీ బడ్జెట్ వండర్..

ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మిస్తోంది.ఈ సినిమా మూడు విభిన్న కాలాల (టైమ్ పీరియడ్స్) నేపథ్యంలో సాగే అద్భుతమైన కథాంశంతో రూపొందుతోందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె నటిస్తుండటంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *