Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 11 మంది ఉద్యోగుల సస్పెన్షన్‌

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINL) లో యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కర్మాగారానికి చెందిన 11 మంది ఉద్యోగులపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారన్న కారణాలతో వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

స్టీల్ ప్లాంట్‌లోని అత్యంత కీలకమైన ‘మిల్స్’ (Mills) విభాగంలో ఆశించిన మేర కాకుండా ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని యాజమాన్యం గుర్తించింది. ఈ ఉత్పత్తి తగ్గుదలకు సంబంధిత విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 11 మందిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే యాజమాన్యం తీసుకున్న ఈ ఆకస్మిక సస్పెన్షన్ నిర్ణయంపై కార్మిక సంఘాలు, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, చర్చ వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *