Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ తో పాన్ ఇండియా లెవెల్లో ఎలా షేక్ చేసాడో అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సినిమాలకి ఎంతో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్ గా లుక్ పరంగా బన్నీ చాలా ప్రయోగాలు చేసాడు. ఇలా పుష్ప 2 కి కూడా ఒక డీ గ్లామర్ లుక్ లో ఫిజికల్ గా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యి మంచి అభిమానులకు మంచి ట్రీట్ అందించాడు.
Also Read: Odela 2: ఓదెల 2 బాలీవుడ్ ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్న తమన్నా?
ఇలా నటన పరంగా కూడా బన్నీ చాలా కష్టపడతాడు. ఎంతవరకు అయినా వెళ్తాడు. అయితే ఇపుడు తన నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ ఒక ప్రయోగాత్మక లుక్ ని సిద్ధం చేస్తున్నట్టుగా మైత్రి నిర్మాత రవి శంకర్ రివీల్ చేశారు. బన్నీ నెక్స్ట్ సినిమాలో లుక్ ఊహించని లెవెల్లో ఉంటుందని, ప్రస్తుతం బన్నీ ఆ లుక్ ప్రిపేర్ చేసే పనుల్లో ఉన్నారంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పుష్ప 2 గంగో రేణుక తల్లి వీడియో :