Alleti Maheswar Reddy:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఈ రోజు (ఏప్రిల్ 1) మరింతగా ముదిరింది. ఒకవైపు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తుండగా, బీజేపీ కూడా నిరసనలకు దిగింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్‌సీయూను సందర్శిస్తుందని ప్రకటించగానే, ఆ పార్టీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఆయన ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు కాపలాగా ఉన్నారు.
Alleti Maheswar Reddy:ఈ దశలో హెచ్‌సీయూ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసనగా దిగారు. ఆ సమయంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించడంతో దీంతో హెచ్‌సీయూ ఆవరణమంతా ఉద్రిక్తంగా మారింది.
Alleti Maheswar Reddy:ఈ సమయంలో హెచ్‌సీయూ భూముల అంశంపై మాట్లాడుతూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి, ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ వద్ద మెప్పు పొందడానికే హెచ్‌సీయూ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. సుమారు రూ.40 వేల కోట్ల విలువైన హెచ్‌సీయూ భూములను కేవలం రూ.20 వేల కోట్లకే ప్రియాంకా గాంధీ భర్త అయిన రాబర్డ్ వాద్రా బినామీకి ఆ భూములను అమ్ముతున్నాడంటూ మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నదని ఏలేటి తెలిపారు.