Vedaraju Timber: ‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘మడత కాజా’, ‘సంఘర్షణ’ చిత్రాలను నిర్మించిన వేదరాజు టింబర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ ఎ.ఐ.జి. హాస్పటిల్ దీనికై చికిత్స తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. త్వరలోనే మరో సినిమాను నిర్మించడానికి వేదరాజు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలా జరగడం బాధాకారమని ఆయన మిత్రులు అన్నారు. వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు.
