Jadeja: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆకట్టుకున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 104* పరుగులతో సెంచరీ చేసిన జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 54 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సాధించింది. 36 ఏళ్ల జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు లభించింది. జడేజా ఇప్పుడు కోహ్లీ-అశ్విన్‌ల ఘనతను సమం చేశాడు. జడేజా ఇప్పటివరకు 86 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు . ఇది అతనికి 10వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. దీనితో, అతను విరాట్ కోహ్లీ, ఆర్. అశ్విన్ అనిల్ కుంబ్లే వంటి ఇతర భారతీయ దిగ్గజాల 10 POTM అవార్డుల ఘనతను సమం చేశాడు.
Also Read: Danish Kaneria: భారత పౌరసత్వంపై పాక్ మాజీ క్రికెటర్ కీలక ప్రకటన
ఈ జాబితాలో జడేజా కంటే ముందు సచిన్ టెండూల్కర్ (14), రాహుల్ ద్రవిడ్ (11) మాత్రమే ఉన్నారు.ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకరైన జడేజా తన బ్యాటింగ్ , బౌలింగ్ తో జట్టుకు భారీ బలం గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కూడా మొదట సెంచరీ చేసి జట్టు 400 పరుగుల మార్కును దాటడానికి సహాయపడిన జడేజా, తరువాత తన బౌలింగ్ తో 4 వికెట్లు తీసి భారత విజయంలో గణనీయమైన పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 448 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 286 పరుగుల ఆధిక్యం లభించింది.