Flights Cancelled

Flights Cancelled: మొంథా తుఫాన్ దెబ్బకు పలు విమానాలు రద్దు

Flights Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ తీరం వైపు వేగంగా దూసుకు వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తీరంలో అలజడి పెరగడంతో రైల్వే శాఖతో పాటు విమానయాన శాఖ కూడా అప్రమత్తమైంది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయవాడ విమానాశ్రయం (Gannavaram Airport) నుండి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.

రద్దయిన విమాన సర్వీసులు (అక్టోబర్ 28న)
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) సంస్థకు చెందిన కింది విమానాలను రేపు, అంటే అక్టోబర్ 28వ తేదీన, రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

* IX 2819: విశాఖపట్నం – విజయవాడ

* IX-2862: విజయవాడ – హైదరాబాద్‌

* IX-2875: బెంగళూరు – విజయవాడ

* IX-2876: విజయవాడ – బెంగళూరు

* IX-976: షార్జా – విజయవాడ (అంతర్జాతీయ విమానం)

* IX-975: విజయవాడ – షార్జా (అంతర్జాతీయ విమానం)

* IX2743: హైదరాబాద్‌ – విజయవాడ

* IX-2743: విజయవాడ – విశాఖపట్నం

విజయవాడ నుంచి విదేశాలకు (షార్జా) వెళ్లాల్సిన, షార్జా నుంచి విజయవాడకు రావాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలు కూడా ఈ రద్దు జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

రైళ్లపైనా తుఫాన్ ప్రభావం
విమానాల రద్దుతో పాటు, ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో కూడా ముందస్తు చర్యగా పలు రైలు సర్వీసులను మూడు రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. తీర ప్రాంతంలో వాతావరణం అనుకూలించే వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *