Alia Bhatt: ‘గంగూభాయ్ కతియావాడీ’తో జాతీయ ఉత్తమనటిగా అవార్డును అందుకున్న ఆలియాభట్… పాపులారిటీ విషయంలో మాత్రం సమంత వెనకే స్థానానికే పరిమితమైంది. మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్స్ విషయంలో ఓర్మాక్స్ మీడియా నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ లో టాప్ టెన్ జాబితాలో సమంత ప్రథమస్థానం దక్కించుకుంది. ఆమె తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఆలియాభట్, దీపికా పదుకునే నిలిచారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నయనతార, త్రిష ఉన్నారు. ఆరు నుండి పది వరకూ వరుసగా శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రశ్మిక మందణ్ణ, కియరా అద్వానీ చోటు దక్కించుకున్నారు. ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సీరిస్ ట్రైలర్ విడుదలైన తర్వాత సమంత క్రేజ్ జాతీయ స్థాయిలో అమాంతంగా పెరిగిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
