Akshay Kumar

Akshay Kumar: ఖిలాడి క్రేజీ బిజినెస్.. కోట్లలో లాభాలు!

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమాలతోనే కాదు, రియల్ ఎస్టేట్‌లోనూ తన తెలివితేటలు చూపిస్తున్నారు. ముంబైలోని బోరివాలిలో 2017లో కొనుగోలు చేసిన రెండు అపార్ట్‌మెంట్లను రూ.7.10 కోట్లకు అమ్మి 92% లాభం గడించారు. ఒక ఫ్లాట్‌ను రూ.3.02 కోట్లకు కొని, రూ.5.75 కోట్లకు అమ్మగా, మరో ఫ్లాట్‌ను రూ.67.90 లక్షలకు కొని రూ.1.35 కోట్లకు విక్రయించారు. ఈ డీల్స్‌లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మార్చిలో రూ.6.60 కోట్లకు రెండు ఫ్లాట్లు, ఏప్రిల్‌లో రూ.8 కోట్లకు ఆఫీస్ స్పేస్‌ను అమ్మారు. ఈ విధంగా రియల్ ఎస్టేట్‌లో అక్షయ్ కోట్లు సంపాదిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *