Amala Akkineni

Amala Akkineni: అమల కాలేజ్‌కు గ్లోబల్‌ గుర్తింపు?

Amala Akkineni: మాజీ నటి అక్కినేని అమల నడిపిస్తున్న అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్ మీడియా మెక్సికోలోని సిలెక్ట్‌ కాంగ్రెస్‌ 2025లో పాల్గొంది. సినిమా విద్యలో అమల కాలేజీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దీంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Nayanthara: నయనతార.. ఆల్ టైమ్ రికార్డు?

మాజీ నటి అమల అక్కినేని నడిపిస్తున్న అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్ మీడియా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. మెక్సికోలో అక్టోబర్‌ 27 నుంచి 31 వరకు జరుగుతున్న సిలెక్ట్‌ కాంగ్రెస్‌ 2025లో ఈ కాలేజ్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. సిలెక్ట్‌ (CILECT) అంటే ప్రపంచ సినిమా, టెలివిజన్‌, మీడియా కాలేజీల సంఘం. సినిమా విద్య, సాంకేతికత, సృజనాత్మకతపై పరిశోధనలు, సహకారం దీని లక్ష్యం. అమల మాట్లాడుతూ, ఈ కాంగ్రెస్‌లో పాల్గొనడం గర్వకారణమని అన్నారు. తమ విద్యార్థులు సృజనాత్మకంగా కథలు చెప్పేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.ఈ విధంగా భారత సినిమా విద్యను ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో అమల ముందుకు సాగుతున్నారు. ఇది నిజంగా తెలుగు సినీ రంగానికి గర్వకారణమని అక్కినేని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *