Akkineni Akhil Reception: నటుడు అఖిల్ అక్కినేని, జైనబ్ పెళ్లి రిసెప్షన్ శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖుల రాకతో వేడుక మరింత వైభవంగా మారింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకోవడంతో అవి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇందుకు ముందుగా జూన్ 6వ తేదీన అఖిల్-జైనబ్ వివాహం ప్రముఖ నటుడు నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.
ఈ రిసెప్షన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-నమ్రతా దంపతులు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిచేత ఫోటోలు దిగిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక పలువురు రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, సినీ నటీనటులు, వ్యాపారవేత్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
వధువు జైనబ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె వ్యాపార రంగంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, ఆమె ఒక మంచి థియేటర్ ఆర్టిస్ట్, ప్రతిభావంతురాలైన పెయింటర్. ఆమె కళాప్రదర్శనలు భారత్‌తో పాటు విదేశాల్లో కూడా నిర్వహించారు. సోషల్ మీడియా వేదికలో సైతం ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.