Ambati Rambabu: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన ఇంటిలో పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. మధ్యాహ్నానికి కోర్టులో ప్రవేశపెట్టేలా ఏర్పాట్లు చేశారు.
ఈ కేసుకు సంబంధించి జర్నలిస్టు కృష్ణం రాజు ఓ టీవీ డిబేట్‌లో రాజధాని అమరావతిలో వేశ్యలు ఉన్నారన్న వ్యాఖ్యలు చేయగా, ఆ డిబేట్‌ను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావుపై కూడా బాధ్యత ఏర్పడిందంటూ కేసు నమోదు అయింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఇందులో కృష్ణం రాజుతో పాటు కొమ్మినేని, సాక్షి టీవీ యాజమాన్యం పేర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Harish Rao: కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన హరీష్‌రావు విచారణ
ఈ కేసులో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం, ఇతర గంభీరమైన నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు దారుగా ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఉన్నారు.
రాజకీయ స్పందన: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
కొమ్మినేని అరెస్టుపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొమ్మినేని కమ్మ కులస్తుడైనా చంద్రబాబును విమర్శించారని అతనిపై కక్ష సాధిస్తున్నారు’’ అంటూ ఆరోపించారు. తన ట్వీట్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను ట్యాగ్ చేశారు. ఈ వ్యాఖ్యలు నూతన రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.
ఇదే సమయంలో పలువురు రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తూ, మీడియా స్వేచ్ఛ, వ్యాఖ్యల బాధ్యత, ప్రభుత్వ యంత్రాంగ ప్రవర్తనలపై ప్రశ్నలు వేస్తున్నారు.
కొమ్మినేని “కమ్మ” అయ్యి
తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష !@ncbn @naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) June 9, 2025