Akhil: అక్కినేని నాగార్జున, అమల తనయుడు అఖిల్ వివాహ నిశ్చితార్థం గత యేడాది చివరిలో జరిగింది. ఈ యేడాది వారి పెళ్ళి ఉంటుందని నాగార్జున అప్పుడే తెలిపాడు. అన్నట్టుగానే ఈ యేడాది మార్చి 24న అఖిల్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో శ్రియా భూపాల్ తో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్ళి మండపం వరకూ సాగలేదు. మధ్యలోనే వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత చాలా కాలం సింగిల్ గా ఉన్న అఖిల్… జైనాబ్ రవడ్జీతో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి ఒక్కటి కావాలని భావించిన ఇందులో తొలి అడుగుగా వివాహ నిశ్చితార్థాన్ని ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరుపుకున్నారు. ఇప్పుడు వీరి వివాహం మార్చి 24న జరుగబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక కెరీర్ విషయానికి వస్తే… ‘ఏజెంట్’ పరాజయంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు ‘లెనిన్’ అనే మూవీలో నటిస్తున్నాడు.