Akshay Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. మోహన్ బాబుతో మొదలు పెట్టి మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్ ఇలా బహుభాషా నటులు ఇందులో అతిథి పాత్రల్లో మెరియబోతున్నారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమా మహాశివుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. అక్షయ్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలో మోహన్ బాబు ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘కన్నప్ప’లో టైటిల్ రోల్ ను ఎంతో భక్తిశ్రద్ధలతో విష్ణు పోషించారు. ఇందులోని మూడు పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి స్టీఫెన్ చక్కని సంగీతాన్ని అందించారు.
