LENIN

LENIN: అఖిల్ ‘రాయలసీమ’ రచ్చ.. చిత్తూరు యాసలో మాస్ యాక్షన్‌తో దసరా బరిలో!

LENIN: అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) రూపొందిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాంగ్ షూట్ తర్వాత అఖిల్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక సెట్స్ కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసలో మాడ్యులేషన్‌తో మాస్ అవతారంలో కనిపించనున్నాడు. అందాల తార శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూనిట్ ప్లాన్ ప్రకారం, ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. అఖిల్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. ఈసారీ 8.25శాతమే.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *