Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న ‘అఖండ 2’ షూటింగ్ ఊపందుకుంది. ఈ భారీ మాస్ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ జార్జియాకు వెళ్లనుంది. మే 21 నుంచి బాలయ్యతో పాటు పలువురు ఫైటర్స్ పాల్గొనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. బోయపాటి ఇప్పటికే జార్జియాలో లొకేషన్స్ ఖరారు చేశాడు.
Also Read: vijay devarakonda: రష్మికతో పెళ్లి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ
Akhanda 2: అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అఖండ’ సక్సెస్ తర్వాత సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్లైమాక్స్ సీన్స్ మాస్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయనున్నాయని టాక్. బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు!