Akhanda 2 Movie Update

Akhanda 2 Movie Update: మహా కుంభమేళాలో బాలయ్య అఖండ తాండవం! 

Akhanda 2 Movie Update:  ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సక్సెస్ ఫుల్ స్టార్ ఎవరైనా ఉన్నారూ అంటే అది బాలకృష్ణ ఒకరే! ఇప్పటికే ఒక హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబుకు ఈ పండుగలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. దీంతో రెండో హ్యాట్రిక్ వైపు మరో అడుగు పడింది. వరుసగా నాలుగు హిట్లు.. ఈ మధ్యకాలంలో ఏ హీరోకూ లేవు. ఒకపక్క బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటూ ఆహా అనిపిస్తున్న బాలకృష్ణ.. మరోవైపు సినిమాల్లో కూడా అన్ స్టాపబుల్ విక్టరీలతో దూసుకుపోతున్నారు. అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్.. అదీ ఒకదానికి ఒకటి సంబంధం లేని కథనాలతో.. సరికొత్త బాలయ్య ప్రతి సినిమాలో కనిపిస్తూ వస్తున్నారు. దీనికి కొనసాగింపుగా డాకూ మహారాజ్ సంక్రాంతికి థియేటర్లలో దద్దరిల్లే సౌండ్ చేస్తోంది. 

Akhanda 2 Movie Update: ఈ నేపథ్యంలో బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ వస్తోంది. అఖండ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 తాండవం మూవీకి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న ఈ సౌండ్ వింటే.. మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ కి బాలయ్య బాబు రెడీ అయిపోతున్నారని పించడం గ్యారెంటీ. అఖండ ఏ రేంజ్ హిట్టో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ మరింత హిట్ కావడం గ్యారెంటీ అని సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అందరికీ స్పష్టం అయ్యేలా ఆ అప్ డేట్ ఉంది. 

Akhanda 2 Movie Update: ఇంతకీ ఈ సూపర్ అప్ డేట్ ఏమిటంటే.. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తులు ఈ కుంభ మేళాలో సందడి చేస్తున్నారు. ప్రపంచంలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక ఈవెంట్ గా మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పుడు ఈ కుంభమేళా దగ్గర బాలయ్య లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం షూటింగ్ జరగబోతోంది. అఖండ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 సినిమా షూటింగ్ మహా కుంభమేళా లో జరగబోతోందన్న వార్త వింటే బాలకృష్ణతో మరోసారి డైరెక్టర్ బోయపాటి గట్టి సంచలనమే సృష్టించేలా కనిపిస్తోంది. సనాతన ధర్మం గురించి.. అఖండ సినిమాలో బాలకృష్ణ డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. ఇప్పుడు అదే రేంజ్ లో అఖండ 2 సినిమా కూడా ఉంటుందని అభిమానులు సంబరపడిపోయేలా మహా కుంభమేళాలో అఖండ 2 తాండవం షూటింగ్ న్యూస్ బజ్ వినిపిస్తోంది. 

ఈ హాయ్ వోల్టేజ్ బాలకృష్ణ సినిమాను ఆయన చిన్న కూతురు ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇటీవలే సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన తేజస్విని.. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో కలిసి అఖండ 2 తాండవం మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహాకుంభ మేళాలో ప్రారంభమైంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *