Akhanda 2

Akhanda 2: అఖండ 2 డిజిటల్ రైట్స్.. సంచలన డీల్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “అఖండ 2” సినిమా దసరా పండగ సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా విడుదల కాకముందే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. జియో హాట్‌స్టార్ ఈ సినిమా హక్కులను రూ. 85 కోట్లకు కొనుగోలు చేసింది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది అత్యధిక డిజిటల్ డీల్ కావడం విశేషం.

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “అఖండ 2” టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. టీజర్‌లో బాలకృష్ణ శివ భక్తుడైన నంది పాత్రలో అద్భుతంగా నటించారు. దుష్టశక్తులను అంతం చేయడానికి త్రిశూలంతో యుద్ధం చేసే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. “అఖండ” సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, “అఖండ 2” కూడా బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా బాలయ్య అభిమానులకు ఈ దసరాకు ఒక పెద్ద కానుకగా మారనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *