Ajith

Ajith: విజయ్ రాజకీయ ఎంట్రీపై అజిత్ సంచలన కామెంట్స్!

Ajith: సౌత్ సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, తమిళనాట దళపతి విజయ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’తో సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ ఎంట్రీపై తమిళ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Also Read: Allu Arjun: మెగాస్టార్ పై మరోసారి తన ప్రేమని బయటపెట్టిన ఐకాన్ స్టార్!

Ajith: విజయ్ నిర్ణయంపై అజిత్ మాట్లాడుతూ, “రాజకీయ రంగ ప్రవేశం ధైర్యమైన నిర్ణయం. విజయ్‌కి అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నా” అని అన్నారు. ఈ కామెంట్స్ ఇరు హీరోల అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టగా, విజయ్ ‘జన నాయగన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్ల సినీ, రాజకీయ జర్నీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *