AK64: తమిళ టాప్ స్టార్ అజిత్‌కుమార్ అభిమానులకు శుభవార్త. అజిత్ మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ నిర్మించనుందని సమాచారం. గతంలో అజిత్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తీసి, బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అధిక్ రవిచంద్రన్, ఈసారి కొత్త శైలితో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీరి కొత్త చిత్రం గురించి రాబోయే వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా అజిత్ అభిమానులకు మరో వినోద హంగామా కాబోతోందని టాక్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? రిలీజ్ ఎప్పుడు?
Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’: ఇంకా వారమే?
అజిత్‌కుమార్ తన 64 వ చిత్రంతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్, ఈసారి కొత్త శైలితో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నవంబర్‌లో ప్రారంభం కానుంది, 2026 సమ్మర్లో విడుదల కావచ్చని అంచనా. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. గతంలో అజిత్ ‘వేదాలం’, ‘వివేగం’, ‘విడాముయర్చి’ చిత్రాలతో అలరించిన టాప్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి కూడా స్వరాలు సమకూర్చనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.