Airport Authority Recruitment 2025

Airport Authority Recruitment 2025: టెన్త్ ఫాసైతే చాలు భయ్యా.. ఎయిర్ ఫోర్టులో ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి

Airport Authority Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఎయిర్‌పోర్ట్ అథారిటీ రిక్రూట్‌మెంట్ 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో పశ్చిమ ప్రాంతంలో 206 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్ aai.aero వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్)లో 168 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 38 ఉండగా, అందులో 2 అధికారిక భాష, 4 ఆపరేషన్స్, 21 ఎలక్ట్రానిక్స్, 11 అకౌంట్స్ పోస్టులు ఉన్నాయి.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంకా ఖాళీల సంఖ్య పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ రిక్రూట్‌మెంట్ 2025: ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ: 25-02-205
ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు చివరి తేదీ: 24-03-205
ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: తరువాత ప్రకటించబడుతుంది.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ రిక్రూట్‌మెంట్ 2025: పే స్కేల్

ఎంపికైన అభ్యర్థులు వారి ప్రాథమిక జీతంతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్రయోజనాలలో డియర్‌నెస్ అలవెన్స్, ప్రాథమిక ఆదాయంలో 35%కి సమానమైన అలవెన్సులు, ఇంటి అద్దె అలవెన్స్ (HRA), కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (CPF, గ్రాట్యుటీ, సామాజిక భద్రతా పథకాలు, వైద్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రోత్సాహకాలు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాలు , మార్గదర్శకాల ప్రకారం ఇవ్వబడతాయి.

సీనియర్ అసిస్టెంట్ ప్రాథమిక వేతనం రూ.36,000 – రూ.1,10,000 మధ్య ఉండగా, జూనియర్ అసిస్టెంట్ ప్రాథమిక వేతనం రూ.31,000 – రూ.92,000 మధ్య ఉంటుంది.
అర్హత ప్రమాణాలు

సీనియర్ అసిస్టెంట్: సంబంధిత రంగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత, అనుభవం.
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 10వ తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ , అగ్నిమాపక శిక్షణ.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ రిక్రూట్‌మెంట్ 2025: వయోపరిమితి
దరఖాస్తుదారు వయస్సు మార్చి 24, 2025 నాటికి 30 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. రిజర్వ్‌డ్ గ్రూపులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ
సీనియర్ & జూనియర్ అసిస్టెంట్ల ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. బోధనా మాధ్యమం హిందీ లేదా ఇంగ్లీష్. ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nimmala ramanaidu: ఉత్తరాంధ్రపై వైసీపీ మొసలికన్నీరు కార్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *