Air India flight: మరో ఎయిర్ ఇండియా విమానం చిక్కుల్లో పడింది. 2 గంటలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఉన్న ఆ విమానం వెళ్లేందుకు వాతావరణం సహకరించలేదు. సిబ్బంది సమయస్ఫూర్తితో ఆ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
Air India flight: కేరళ రాష్ట్ర రాజధాని నగరమైన ట్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానానికి వాతావరణం సహకరించలేదు. దీంతో పైలెట్లు ఆ విమానాన్ని దారి మళ్లించి చెన్నై వైపు మళ్లించారు. దాదాపు రెండు గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత చెన్నైలో సేఫ్ ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Air India flight: విమానం గాలిలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఆ రెండు గంటలు గడిపారు. ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సిబ్బంది కూడా గాబరా పడ్డారు. సేఫ్ ల్యాండ్ అయ్యాక అంతా ఊపీరి పీల్చుకున్నారు. అదే విమానంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఉండటం గమనార్హం.