Air India flight: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం అంతర్జాతీయంగా ఆందోళన నెలకొన్నది. చిన్నపాటి అలికిడి వచ్చినా విమాన సిబ్బంది, ప్రయాణికులు ఉలిక్కి పడుతున్నారు. పలు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రాగా, వెనక్కి మళ్లిపోయి తనిఖీల అనంతరం బయలుదేరి వెళ్లిన విమానాలు ఉన్నాయి. చిన్నపాటి సాంకేతిక లోపం ఉన్నా సక్రమంగా సరిచేసుకున్నాకే ఆలస్యమైనా బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడా అదే జరిగింది.
Air India flight: శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వెళ్లాల్సిన ఏఐ 180 అనే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో కోల్‌కతా రాగానే దానిని గుర్తించిన సిబ్బంది, అదే విమానాశ్రయంలో విమానంలోని ప్రయాణికులు అందరినీ దించేశారు. బిక్కుబిక్కుమంటూ బతుకు జీవుడా అంటూ ప్రయాణికులు దిగి ప్రత్యామ్నాయం కోసం వేచి ఉన్నారు.