Hyderabad: ప్రత్యేక పూజల పేరిట ఓ మహిళను మోసగించి రూ.10 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలపై అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి, చేవెళ్ల కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల న్యాయ హిరాసత్ విధించింది. ప్రస్తుతం అఘోరీను సంగారెడ్డి సబ్‌జైలుకు తరలించారు.
వివరాల ప్రకారం, తన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కావాలని ఆశతో ఓ మహిళ ఆ అఘోరీని ఆశ్రయించింది. అప్పుడు అతను ప్రత్యేక పూజలు చేస్తే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పి, దశలవారీగా దాదాపు రూ.10 లక్షలు ఆమె నుంచి తీసుకున్నాడు. అయితే సమస్యలు తీరకపోవడంతో, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుని 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలు కోర్టులో విచారణలో ఉన్నాయని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు.
ఇటీవలే అఘోరీ వర్షిణి అనే యువతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరినీ పోలీసులు మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో గుర్తించి, అఘోరీని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు, వర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్‌కు తరలించినట్టు సమాచారం.