Venkatesh

Venkatesh: 20 కథలు రిజెక్ట్.. ఆచి తూచి అడుగులేస్తున్న వెంకీ మామ!

Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 303 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకీ మామ ఈ సారి చేసే సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 20 కథలు విన్నారు. కానీ ఒక్కటి కూడా ఓకే చేయలేదు వెంకీ. ఏ మాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించిన ఎంత పెద్ద డైరెక్టర్ అయిన సరే రిజెక్ట్ చేసేస్తున్నాడు. గతంలో F3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ అనే యాక్షన్ సినిమా చేసాడు. కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు ఆచి తూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడు ఈ సీనియర్ హీరో. అంతేకదా ఏదేమైనా రూ. 303 కోట్ల రీజినల్ ఇండస్ట్రీ తర్వాత చేసే సినిమా అంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోపోతే ఎలా అంటున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Aurangzeb Tomb: ఔరంగజేబు సమాధి వివాదం.. విరుచుకు పడుతున్న విపక్షాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *