Emerging Asia Cup 2024

Emerging Asia Cup 2024: ఆసియా కప్‌ టీ20 టోర్నీ విజేత ఆఫ్ఘనిస్తాన్

Emerging Asia Cup 2024: ఏసీసీ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్‌-ఏ జట్టు నిలిచింది.  ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌-ఏ టీమ్  శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో బిలాల్‌ సమీ 3 వికెట్లు, అల్లా ఘజన్‌ఫర్‌ 2 వికెట్లు తీసుకుని  అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో  తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.  శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్‌ అరచ్చిగే  64 పరుగులు చేశాడు.  ఆఫ్ఘనిస్తాన్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చాంపియన్ గా నిలిచింది. ఆఫ్ఘన్ జట్టులో  సెదికుల్లా అటల్‌ 55 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అల్లా ఘజన్‌ఫర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సెదికుల్లా అటల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా ఎంపికయ్యాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vaibhav Suryavanshi: కుర్రాడే కానీ.. ఐపీఎల్ మెగా వేలంలో మెరుస్తున్నాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *