Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి పాకిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 2016లో భారత పౌరసత్వం పొందిన అద్నాన్, తాజాగా అజర్‌బైజాన్‌లోని బాకు వీధుల్లో పాకిస్తానీ యువకులతో జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ యువకులు, “మీరు సకాలంలో పాకిస్తాన్ వదిలేశారు. మేమూ పౌరసత్వం మార్చుకోవాలనుకుంటున్నాం. మా ఆర్మీ మా దేశాన్ని నాశనం చేసింది!” అని వాపోయారని అద్నాన్ వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. అద్నాన్‌ను ‘గద్దార్’ అని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన మాటల్లో నిజం ఉందని సమర్థిస్తున్నారు. 2001లో భారత్‌కు వచ్చిన అద్నాన్, 2015లో పాక్ పాస్‌పోర్ట్ గడువు ముగియడంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాక్ సైన్యం పట్ల తన వ్యతిరేకతను ఆయన గతంలోనూ వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో, భారత్-పాక్ సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. అద్నాన్ వ్యాఖ్యలు పాక్ యువతలోని అసంతృప్తిని బయటపెడుతున్నాయా? ఈ ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.